పల్లెల ప్రగతే ప్రభుత్వ లక్ష్యం


Mon,September 9, 2019 02:59 AM

పాన్‌గల్‌ : పల్లెల ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామా లు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని జెడ్పీ చైర్మన్‌ రాకాసి లోకనాథ్‌రెడ్డి అన్నారు. 30 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా ఆదివారం జెడ్పీ చైర్మెన్‌, కలెక్టర్‌ శ్వేతామొహంతిలు పాన్‌గల్‌ మం డలంలోని కేతేపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో తిరిగి సీసీరోడ్లు, మురుగు కాలువ లు, మిషన్‌ భగీరథ నీటి సరఫరా, పాడుబడిన ఇండ్లు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పరిశీలించారు. ఇంటితోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రం గా ఉంచుకోవాలని, మురుగునీటిని రోడ్డుపైకి వదిలేయకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని జెడ్పీ చై ర్మన్‌ సూచించారు. ఎస్సీ కాలనీలో మిషన్‌ భగీరథ పైపులైన్లను మురుగు కాలువలో కలిపి వేయడం గుర్తించిన కలెక్టర్‌ సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి న గ్రామసభలో లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రమదానం ద్వారా ము రుగు కాల్వలను, శుభ్రపరుచుకోవడం వంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేనంతవరకు గ్రామాలు అభివృద్ధి చెందవన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 70 వేల మందికి ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకుగాను రూ.16కోట్లను ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ఖాళీ స్థలాల్లో తుమ్మ, పిచ్చి మొక్కలను తొలిగించడం జరుగుతుందన్నారు.

విజయవంతం చేయాలి : కలెక్టర్‌ శ్వేతామొహంతి
గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులంద రూ కూర్చొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ శ్వేతామొహంతి అన్నారు. ముఖ్యంగా మురుగునీరు రోడ్లపైన, ఇంటిముందర నిలువ ఉండకుండా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. గ్రా మాన్ని శుభ్రం చేయడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. గ్రామంలో వంగిపోయిన విద్యుత్‌ స్తంభాలు, వేలాడుతున్న వైర్లను సరిచేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటిక వాగు మధ్యలో ఉన్నందున ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని తాసిల్దార్‌ శ్రీరాములును ఆదేశించారు. సమావేశంలో సర్పంచ్‌ అనిత, ఎంపీటీసీ శ్యామల, రైతు సమన్వయ సమితి జిల్లా స భ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో గణేశ్‌, జెడ్పీ సీఈవో నరసింహులు, డీపీవో రాజేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ మేఘారెడ్డి, ఎంపీడీవో సా యిబ్రింద, పంచాయతీ కార్యదర్శి అనురాధ ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...