జూరాలలో 13 గేట్లు ఎత్తివేత


Mon,September 9, 2019 02:57 AM

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాల ప్రాజెక్ట్‌లో వరద స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 1,65,000, అవుట్‌ ఫ్లో 1,72,330 క్యూసెక్కులు నమోదైంది. దీంతో ప్రాజెక్ట్‌ అధికారులు 13 గేట్లను ఎత్తి స్పిల్‌ వే ద్వారా 1,32,760 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుల చేస్తున్నన్నారు. జూరాల ప్రాజెక్ట్‌ సామర్థ్యం 318.516మీటర్ల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 318.400 మీటర్ల ఎత్తులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీటి మట్టాన్ని నిండనివ్వకుండా వచ్చిన నీటిని వచ్చినట్లుగా నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ ద్వారా 698 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 650క్యూసెక్కులు నీటిని అధికారులు కాల్వల్లోకి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్‌హౌస్‌ ద్వారా 34,346 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఆరు టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌-1 ద్వారా 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,55, 850క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,74,991 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్‌ అధికారు లు నదిలో 108.23టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 1,60, 560, అవుట్‌ఫ్లో 1,68,549 క్యూసెక్కులు నమోదైంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64టీఎంసీల నీటినిల్వ ఉండగా ప్రాజెక్ట్‌లో 34.52 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...