చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి


Mon,September 9, 2019 02:57 AM

లింగాల: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌ నాగభూషణం అన్నారు. ఆదివారం పాఠశాల క్రీడా మైదానంలో అండర్‌-14,17,19 ఉమ్మడి పాలమూరు జిల్లాస్థాయి గురుకుల బాలుర విద్యార్థులకు ఖోఖో, వాలీబాల్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో తొమ్మిది పాఠశాలలు, ఆరు జూనియర్‌ కళాశాలలు 450విద్యార్థులు, 25 పీఈటీలు, 25 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, చదువుపై ఆసక్తి పెరగడం కాకుండా నాయకత్వ లక్షణాలు ఏర్పడుతాయని అన్నారు. విద్యార్థి స్థాయి నుంచి శ్రమించే తత్వం, పట్టుదలను పెంపొదించుకోవాలన్నారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు పాఠశాలస్థాయి క్రీడలు దోహద పడుతాయన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎంపిక చేసి ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరిగిలో నిర్వహించే జోనల్‌స్థాయిలో పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ నాగభూషణం తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రీజనల్‌ క్రీడల కోఆర్డినేటర్‌ వెంకటేశ్వర్లు, పీడీలు భాస్కర్‌గౌడ్‌, సెహిఅలీ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

14
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...