సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తాం


Mon,September 9, 2019 02:57 AM

-ఎంపీపీ గుంత మౌనిక
మదనాపురం (కొత్తకోట) : పరిగెత్తుతున్న సమాజానికి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు టెక్నాలజిని పెంచుకోవాలని ఎంపీపీ గుంత మౌనిక అన్నారు. ఫొటోగ్రాఫర్‌-ఫొటో ఎగ్జిబిషన్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆధివారం మండల కేంద్రంలోని పాత జూనియర్‌ కళాశాలలో ఫొటోగ్రాఫర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గుంత మౌనిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫొటోగ్రఫి వృత్తి కత్తిమీద సాములాంటిదని నిరుపేదలకు సేవలు అందించే విధంగా తక్కువ రేటుతో ఎక్కువ సేవలు అందించి వారి మదుర జ్ఞాపకాలను ఫొటోలో బందించి ప్రజలకు అందజేస్తు, అందరి మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. కొత్తకోటలో ఫొటోగ్రఫి అసొసియేషన్‌ కమ్యూనిటీ భవనం కోసం ప్రభుత్వ భూమిని చూపిస్తే, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కమ్యూనిటీ హాల్‌కు నిధులు సాధించి త్వరలో నిర్మాణం చేపడుతామన్నారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల నోటిఫికేషన్‌ వెలువడితే ఫొటోగ్రాఫర్లకు ప్రాధాన్యత ఇచ్చి బ్యాంకు రుణాలు అందించి ఆదుకుంటామని అన్నారు. అర్హులైన ఫొటోగ్రాఫర్లకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ద్వారా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇప్పించి వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటానని హామీ ఇచ్చారు. కొత్తకోట, మదనాపురం ఉమ్మడి మండలాలకు సంబంధించి 60 మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారని, ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల వరకు ఒక్కొక్కొరికి రూ.250 ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ గుంత మౌనికను ఫొటో గ్రాఫర్లు సన్మానించారు. కార్యక్రమంలో యాదయ్య సాగర్‌, మహమ్మద్‌ సలాం, ముజీబ్‌, గోవర్ధన్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...