గ్రామాల అభివృద్ధికి సహకరించండి


Mon,September 9, 2019 02:57 AM

- జెడ్పీటీసీ సామ్యనాయక్‌
ఖిల్లాఘణపురం : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేద్దామని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీటీసీ సామ్యనాయక్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్‌ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి రాధతో కలిసి వీధుల గుండా తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. ముందుగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై నోట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో గ్రామాలలో సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుందని, అందుకు ప్రజలు అధికారులకు సహకరించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వీధిలైట్లు సీసీరోడ్లు, కరెంట్‌ సమస్య, బావుల పూడ్చివేత, పాత ఇండ్లను కూల్చివేయుట తదితర అభివృద్ధి పనులను ఈ 30 రోజులలో చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వీధుల గుండా తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ యాదయ్య, వార్డు సభ్యులు బాల్‌రెడ్డి, మధు, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...