తీరొక్క చీరలు


Sun,September 8, 2019 03:24 AM

-జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
-వనపర్తి మార్కెట్ గోదాంలో నిల్వ
-అందుబాటులో వంద డిజైన్లు
-జిల్లాకు చేరుకున్న 1.05లక్షల చీరలు


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ :బతుకమ్మ పండుగ సంబురంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సంబురం దగ్గర పడుతున్న వేళ ముందస్తుగానే చీరల పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఈ పండుగను ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ప్రతి ఏట ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఏడాది బతుకమ్మ సంబురానికి జిల్లా మొత్తానికి లక్షా 85 వేల చీరలు అవసరమవుతాయని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

మల్టిపుల్ కలర్స్.. డిజైన్‌లతో..
చేనేత శాఖ ఆధ్వర్యంలో పది రంగులు, వంద డిజైన్లలో చీరల తయారీని చేనేత కార్మికుల ద్వారా ప్రత్యేకంగా సర్కార్ సిద్ధం చేయించింది. గతంలో కంటే మరింత నాణ్యవంతంగా చీరలను నేయించిన ప్రభుత్వం మహిళలు మరింత ఇష్టపడేలా రంగురంగుల చీరలను సమాయత్తం చేసింది.
బతుకమ్మ పండుగలో మహిళలకు అందించే చీరలు మల్టిబుల్ కలర్స్‌తో పాటు ఇతర డిజైన్‌లలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మహిళల వయస్సుకు తగ్గట్టుగా చీరల పంపిణీ చేయనున్నారు. 18 ఏళ్ల పైబడిన యువతుల నుంచి మహిళలందరికీ చీరలను అందించే ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. అలాగే పెద్ద వయస్సున్న వారికి కలర్‌తో బార్డర్ ఉన్న చీరలను పంపిణీ చేస్తారు.

జిల్లాకు చేరుకున్నవి
లక్షా 5 వేల చీరలు..
జిల్లాకు 1.85 లక్షల మంది మహిళలకు చీరలు అవసరం ఉండగా ఇప్పటి వరకు లక్షా 5 వేల చీరలకు పైగా జిల్లాకు చేరుకున్నాయి. వచ్చిన చీరలను మార్కెట్ యార్డులోని గోదాంలో జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్ ఆధ్వర్యంలో నిలువ చేశారు. మిగిలిన చీరలు సైతం త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు. చేనేత శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు చీరలు చేర్చిన అనంతరం వాటిని మహిళలకు అందజేసే బాధ్యతను చేపడతారు. ఈ కమిటీలో నిత్యవసర వస్తువులు సరఫరా చేసే డీలర్, గ్రామ రెవెన్యూ అధికారి, మహిళా సంఘ సభ్యురాలు, వీఏవోల ఆధ్వర్యంలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...