టీటీయూ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం


Sun,September 8, 2019 03:21 AM

వనపర్తి విద్యావిభాగం : తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక తరుణి పంక్షన్‌హాల్‌లో శనివారం సాయంత్రం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. నవ సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల ద్వారానే నిర్మితమవుతుందని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. మొత్తం 30 మంది ఉపాధ్యాయులను సన్మానించినట్లు టీటీయూ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రుక్ముద్దీన్, వెంకటేశ్వర్‌రావు, జిల్లా సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్, గణేశ్, పరీక్షల విభాగాధిపతి మధుకర్, నోడల్ అధికారిణి వరలక్ష్మీ, టీటీయూ నాయకులు రాజారెడ్డి, జావేద్, బాలునాయక్, నాగయ్య తదితరులు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...