క్షయ, కుష్ఠు వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి


Sun,September 8, 2019 03:21 AM

ఖిల్లాఘణపురం : కుష్ఠు, క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు పా టించి ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలని సెంట్రల్ ఇంప్లిమెంటర్ అధికారి బాషా అన్నారు. శనివారం మండలంలోని కోతులకుంట తండాలో జిల్లా ప్రోగ్రాం అధికారి రవిశంకర్ ఆధ్వర్యం లో చేపట్టిన డోర్ టూ డోర్ సర్వేలో ఆయన పాల్గొని పరిశీలించారు. ముందుగా గ్రామంలో ఇంటింటికి తిరుగు తు ప్రజలకు కుష్ఠు, క్షయవ్యాధిపై అవగాహన కల్పించా రు. అదేవిధంగా జిల్లాలో నిర్వహించిన ఇంటింటి సర్వే, వ్యాధి నిర్దారణ నమోదు, వైద్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కుష్ఠు, క్షయవ్యాధి సోకిన, లక్షణాలు ఉన్నవారిని గుర్తించి జాబితాను తయారు చేయడం జరుగుతుందని, అందులో వ్యాధి సోకిన వారికి సరియైన ఆరోగ్య పరీక్షలతో పాటు మందులను అందజేసి వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే జిల్లా లో ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ అజయ్, డీపీహెచ్‌వో నందీశ్వర్, ఆనంద్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ప్రేమలీల, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...