నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేస్తేనే పోలీసులపై ప్రజలకు నమ్మకం


Sun,September 8, 2019 03:21 AM

వనపర్తి విద్యావిభాగం : కోర్టు కానిస్టేబుల్స్ ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడే లా కృషి చేయాలని, అప్పుడే పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం ఉంటుందని ఎస్పీ అపూర్వరావు అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌కు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసు నమోదైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నిందితుల నేరాలను నిరూపించడం లో కోర్టు కానిస్టేబుల్స్ బాధ్యత చాలా కీలకమైందని అన్నారు. బాధితులకు న్యా యం, నేరస్తులకు శిక్షణ పడే విధంగా విధులు నిర్వహించిన వారే, సరియైన సమయంలో సాక్షులను, కేసులకు సంబంధించిన వివరాలను కోర్టుకు అంది ంచి నేరస్తులకు శిక్ష పడేవిధంగా చూడాలన్నారు.
కోర్టు విచారణలో ఉన్న కేసులను పెండింగ్‌లో ఉంచకూడదని, పీసీ నంబర్ త్వరగా తీసుకొని సాక్ష్యాలను ప్రవేశపెట్టి కేసు ట్రయల్ సమయంలో అట్టి కేసుల వివరాలకు సంబంధించి సాక్షులకు వెంటనే తెలియపరిచాలన్నారు. సరియైన సాక్ష్యం చెప్పుటుటకు అవగాహన కల్పించి నేరస్తులకు శిక్ష పడేవిధంగా విధులు ఉండాలని తెలిపారు. రాబోయే లోక్ అదాలత్‌లో 50 శాతం కేసులను కోర్టు అనుమతితో పరిష్కారం చేయాలని ఆమె సూచించారు. శిక్షల శాతం పెంచి ప్రజలకు న్యాయం చేసేవిధంగా పని చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన కోర్టు సిబ్బందికి ప్రతి నెల రివార్డులు అందజేస్తామని ప్రతి ఒక్క రూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో వనపర్తి, జోగులాంబ గద్వాల ఐటీ కోర్ సిబ్బంది గోవింద్, నాగరాజు, కురుమూర్తి, దేవరాజు, కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...