ప్రగతి బాటలో పల్లెలు


Sat,September 7, 2019 01:45 AM

-సీఎం సందేశంతో ప్రారంభం
-గ్రామాల్లో మొదలైన అభివృద్ధి చర్చ
-కో-ఆప్షన్ సభ్యులపై అంచనాకు వచ్చిన అధికారులు
-స్థాయీ సంఘాల ఏర్పాటుపై చర్చ
-నేడు పూర్తి స్థాయిలో నియామకాలు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని చేపట్టిన 30 రోజు ల ప్రత్యేక కార్యాచరణలో శుక్రవారం గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉత్సాహంగా గ్రామ సభలు మొదలయ్యాయి. ప్రభుత్వం గ్రామాలను ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నందునా అందుకు తగ్గట్టుగా ప్రజలను నడిపించేందుకు బీజం పడుతుంది. ఈ మేరకు జిల్లాలో జరిగిన ఆయా గ్రామ సభల్లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతిలు పాల్గొని కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. గోపాల్‌పేట మం డలం బుద్దారంలో మంత్రి సింగిరెడ్డి, జెడ్పీ చైర్మన్, కలెక్టర్‌లు పాల్గొన్నారు. పాన్‌గల్ మండలం రేమొద్దులలో ఎమ్మెల్యే బీరం పాల్గొన్నారు. ప్రజలంతా ఐక్యమంత్యంగా నడవాలని తద్వార అభివృద్ధి పనులు చేపట్టి పల్లెల స్వరూపాన్ని మార్చివేసేలా ముందడగు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముందుగా సీఎం సందేశంతో మొదలైన సభలు గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మొదటి రోజు ప్రధానంగా కో అప్షన్ సభ్యుల ఎంపికలపై ఓ అవగాహనకు వచ్చారు.

అలాగే మరో నాలుగు విభాగాలకు సంబంధించిన స్థాయి సంఘాల ఏర్పాటుపైన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. వీటిపై శనివారం తుది నిర్ణయం తీసుకుని పూర్తిస్థాయిలో నియామకాలకు శ్రీకారం చుట్టనున్నారు. వీటితోపాటు గ్రామంలో పారిశుధ్యం తీరుతెన్నులు, వీధిలైట్ల ఏర్పాటు, మురుగు కాలువల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, మురుగుకంపను తొలగించడంలాంటి వాటిపై చర్చించారు. ఇంకాను స్వల్పకాలిక పనులు దీర్ఘకాలిక పనులపై రెండు విధాలుగా సభల్లో చర్చించి ఒక అవగాహనకు వస్తున్నారు. ఈ 30 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు కూడా నమ్మకం కల్గించేలా పనులు చేపట్టాలని ప్రత్యేక అధికారులు గ్రామ సభల్లో వివరించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నిధులు జమ కావడం.. గ్రామ సభల ద్వారా పనులను గుర్తించడం.. ఆ వెనువెంటనే పను లు ప్రారంభించే చర్యలు చేపడుతుండటంతో గ్రామా ల్లో కొత్త వరవడి కనిపిస్తుంది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...