రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం


Sat,September 7, 2019 01:43 AM

వనపర్తి రూరల్ : మండలంలోని చిట్యాల గ్రామ శివారులో గల మహాత్మాజ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రెడ్డికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావటం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావటంలో పాఠశాల ఉపాధ్యాయుల సహాకారం, విద్యార్థుల క్రమశిక్షణే కారణమని అన్నారు. తనకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారంతో పాటు నగదు బహుమతి రూ.10వేలను పాఠశాల విద్యార్థుల అత్యవసర ఖర్చుల కోసం వినియోగించేందుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు చదువు చెప్పటంలో ఉన్న ఆనందం మరేదానిలో లేదన్నది నమ్మకమన్నారు. ప్రిన్సిపాల్ సన్మానించిన వారిలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గురువయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...