పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే బీరం


Sat,September 7, 2019 01:43 AM

పాన్‌గల్ : ప్రజలు, అధికారు లు, ప్రజాప్రతినిధులు నిబద్ధత తో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రే మొద్దుల, కిష్టాపూర్, గోప్లాపూర్‌లలో నిర్వహించిన గ్రామసభ ల్లో పాల్గొని ప్రసంగించారు. గ్రా మాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకవచ్చేందుకు బృహత్తర కా ర్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. రేమొద్దుల గ్రామంలో నూతనంగా అదనపు పీహెచ్‌సీ, పాఠశాల భవనం, శ్మశాన వాటికలకు త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం పలు కాలనీల్లో తిరిగి డ్రైనేజీ, పాడుబావులను పరిశీలించారు. అలాగే కిష్టాపూర్ గ్రామసమీపంలోని ఎంజీకేఎల్‌ఐ డీ-8 కాలువలో వస్తున్న సాగునీటికి పూలు చల్లి పూజ చేశారు. మండలకేంద్రానికి వెళ్లే మినీ డిస్ట్రిబ్యూటరీ వద్ద గేటు తెరిచి నీటిని వదిలారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడం పట్ల అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కాలువలో నీటి సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతుసమన్వయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీచంద్రశేఖర్‌నాయక్, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ కర్ణాకర్‌రెడ్డి, నాయకులు వెంకటయ్యనాయుడు, తిరుపతయ్య, చంద్రూనాయక్, శేఖర్, యాదగిరిచారి, ఉప సర్పంచ్ రాంబాబు, శివసేనారెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...