యూరియా కొరత లేదు


Sat,September 7, 2019 01:43 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు కావాలని విషపు ప్రచారాలు చేస్తున్నాయని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు, మీడియా సెల్ కన్వీనర్ యోగానందరెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఆగస్టు నెల 19వ తేదీన 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని లేఖ రాయడం జరిగిందని, ఆగస్టు 23వ తేదీన కేంద్ర ప్రతినిధికి ఫోన్ చేయడం జరిగిందన్నారు. వరదలు ఎక్కువగా రావడం, 20 శాతం సాగు అదనంగా పెరగడంతో ముందు చూపుతో మంత్రి, అధికారులు ప్రతి ని మిషం పర్యవేక్షిస్తున్నారని, కేంద్రమే తెలంగాణకు పంపిణీ చేసే ఎరువుల్లో కొంత భాగాన్ని కర్ణాటకకు పంపి ఇక్కడి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. అన్ని ప్రాథమిక సహకార కేం ద్రం గోదాంలలో యూరియా నిలువ ఉందన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...