బయో వ్యర్థాలపై నిర్లక్ష్యం వద్దు


Sat,September 7, 2019 01:42 AM

వనపర్తి వైద్యం : బయోవ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్‌వో డా క్టర్ శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జి ల్లాలోని ప్రైవేట్ దవాఖానలు, రోగ నిర్ధారణ సెంటర్లు, క్లీనిక్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ దవాఖానల్లో వివిధ రకాల వేస్టేజీని ఇష్టానుసారంగా పడేయవద్దని సూచించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రాష్ట్ర కాలుష్య నివారణ సర్టిఫికెట్స్ తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 9 పడకల వరకు అదనంగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ప్రతి బెడ్‌కు రూ.100 అదనంగా చెల్లించాలన్నారు.

బయోమెడికల్‌లో వేస్టు మేనేజ్‌మెంట్‌లో నాలుగు రకాలు డస్ట్‌బిన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఎరుపు డస్టుబిన్‌లో సిరంజీలు, ఐవీ, సెట్స్, చేతితొడుగులు, రక్తబ్యాగులు, మూత్ర బ్యాగులు, డ యాలసిస్ కిట్, ఐవీ బాటిల్స్‌ను, పసుపు దానిలో మానవ, జంతు శరీర నిర్మాణానికి సం బంధించిన వ్యర్థాలు, మాయ, కలుషిత దూది, కలుషిత డ్రసింగ్, విషపూరిత వ్యర్థాలు, గడువు ముగిసిన మందులు, బ్లూ దానిలో ఔషద, గాజు బుడ్డీలు, ల్యాబ్ సైడ్స్, లోహ శ రీర ఇంప్లాంట్, కత్తెరలు, తెలుపు దానిలో సూదులు, స్థిర సూదులు, సిరంజీలు, శస్త్ర చి కిత్స బ్లేడ్లను వేయాలన్నారు. అనంతరం బయోమెడికల్ వేస్ట్ మేసేజ్‌మెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వేతాన్స్ కంపెనీ మేనేజ్‌మెంట్ ప్రమోద్‌రెడ్డి, డాక్టర్ రవిశంకర్, రాష్ట్ర కాలుష్య నివారణ కార్యాలయం నుంచి భాస్కర్ రెడ్డి, బయోమెడికల్ మేనేజ్‌మెంట్ మేనేజర్ విజయ్, మద్దిలేటి, చంద్రయ్య, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...