వనపర్తిలో 75 సీసీ కెమెరాల ఏర్పాటు


Sat,September 7, 2019 01:42 AM

వనపర్తి విద్యావిభాగం : ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని అపూర్వరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం 75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యాపారస్తులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రధాన రోడ్ల మార్గాలలో, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేనుసైతంలో భాగంగా సీసీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో 75 కెమెరాల కృషి చేసిన సీఐని ఎస్పీ అభినందించారు. బులియన్ మర్చంట్, వర్తక సంఘం, గంజి మార్కెట్ అసోసియేషన్, మహేష్ తిరుమల హిల్స్ అసోసియేషన్‌ల యాజమాన్యులను మెమోంటోలతో అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై నరేందర్, శిక్షణ ఎస్సై ఉమ తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...