సైబర్ నేరాలపై జాగ్రత్త వహించాలి


Sat,September 7, 2019 01:42 AM

వనపర్తి విద్యావిభాగం : సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని, ఆన్‌లైన్‌లో లావాదేవీలను జాగ్రత్తగా చేయాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీవీ రామన్ జూనియర్ కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సైబర్ నేరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ని యంత్రించేందుకు సైబర్ ల్యాబ్‌లో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ల్యాటరీలు, మల్టీ లెవల్ మార్కెటింగ్, ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు, మ్యాట్రిమోని ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఏటీఎం ల ఓటీపీల తస్కరణ తదితర మోసాలకు తె రలేపుతున్నారన్నారు. సైబర్ నేరాలగాళ్ల బారిన పడి విలువైన డబ్బు, సమ యం వృథా కాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్నారన్నారు. నేరస్తులను గుర్తించడం అత్యంత కష్టంగా మారిందని, ప్రజలు కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉందని, సమస్య రాకముందే జాగ్రత్తపడడం మంచిదని, మహిళలు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదన్నారు. మ్యాట్రిమోని ద్వారా పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే అవతలి వ్యక్తులను కలిసి ధ్రువీకరించుకునేంత వరకు వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉం చాలన్నారు. ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, మెయిల్స్‌పై ఎవ్వరూ స్పందించొద్దని చెప్పారు. ఆన్‌లైన్‌లో త క్కువ ధరకే వస్తువులు ఉంటే వాటిని నమ్మవద్దని, నాసిరకమైన వస్తువులే కాకుండా ఖాళీ డబ్బాలు పంపిస్తారని తెలిపారు.

సెక్యూరిటీ గార్డు ఉన్న ఏటీఎం సెంటర్లకు వెళ్లడం ఉత్తమమన్నారు. మహిళలు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.విద్యార్థులకు సైబ ర్ నేరాలు, ఫోక్సో నిర్భయ చట్టం గురించి అవగాహన కల్పించారు. అవమానస్పదంగా మీతో ఎవరైనా ప్రవర్తిస్తే 100 లేదా వాట్సాప్ నంబర్ 6303923208, షీటీమ్ వాట్సప్ నంబర్ 63039 23211, ఫేస్ బుక్, ట్విటర్ ఎస్పీ వనపర్తి సైట్‌లకు ఫి ర్యాదు చేస్తే 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, ఎస్సై నరేందర్, కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశ్ ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...