విరివిగా మొక్కలు నాటుదాం


Fri,September 6, 2019 03:18 AM

-ఆక్సిజన్‌ను కొనుక్కునే రోజులు రానున్నాయి
-హరితహారం లక్ష్యానికి మించి చెట్లను పెంచుదాం
-ప్లాస్టిక్ బదులు చేతిసంచులు వాడుదాం : ఎస్పీ అపూర్వరావు

రేవల్లి : రానున్న రోజుల్లో మనుషులకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను కొనుకొని వాడాల్సిన పరిస్థితులు రానున్నాయని ఎస్పీ అపూర్వరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో స్థానిక పొలీసుల ఆధ్వర్యంలో ఆమె హరితహారం, ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్సిజన్ ముప్పునుంచి మనమందరం బయటపడాలంటే గ్రామాల్లో విరివిగా మొక్కలను నాటి పెంచాలని ఆమె తెలిపారు. ఆదేవిధంగా పాస్టిక్ వాడకంపై కలిగే నష్టాల గురుంచి వివరించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సంచులను వాడాలని గ్రామాన్ని నాటిన మొక్కలతో పచ్చగా, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ సృజన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటాలని ఆమె అన్నారు.

అంతకుముందు సురక్ష పోలీస్ కాళాకారుల బృందంచే ఆటపాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్లాస్టిక్ వాడకం మొక్కల నాటడంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో వ్యాసరచన పొటీలు నిర్వహించారు. అందులో మంచి ప్రతిభ కనబరిచినవారికి ఎస్పీ అపూర్వరావు బహుమతులను అందజేశారు. అంతకుముందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేశవులును శాలువాతో సత్కరించారు. ఆదేవిధంగా మండలంలోని నాగపూర్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీ శ్రీశైలం యాదవ్‌తో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ శంకర్‌నాయక్, జడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ బంకలసేనాపతి, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్, హెడ్‌కానిస్టేబుల్ బాలీశ్వర్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ శేషమ్మ, డిప్యూటీ తాసిల్దార్ చక్రపాణి, నాయకులు బిచ్చిరెడ్డి, నరహరి, శ్రీనివాస్‌రెడ్డి, కళాకారులు శ్రీశైలంచారి, నాగేంద్రం, సత్యనారాయణ, జయరాం పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...