అవగాహన కల్పిస్తున్నాం


Fri,September 6, 2019 03:16 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పౌష్టికాహార కార్యక్రమాన్ని జాతీయ న్యూట్రీషణ్ ద్వారా అమలు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పోషణ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ నాగిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ నెల మొత్తం పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ, ఆశ, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా గర్భవతులు, బాలింతలు, పుట్టిన బిడ్డ రెండేళ్ల తీసుకోవాల్సిన జాగ్రత్త లు, పౌష్టికాహారంపై అవగాహనలో కుటుంబసభ్యులు కూడా పాల్గొనేలా అంగన్‌వాడీలు పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి సిరప్ వంటివి ఇవ్వనున్నట్లు వివరించారు. సమావేశంలో పోషణ అభియన్ డీఎంఏ వనజాకుమారి, బీపీఏ శేఖర్, మహేశ్ ఉన్నారు.

పురస్కార్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి..
మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలబాలికలకు సేవలందించే వ్యక్తులు, సంస్థలు 2019-20లో భాగంగా అందించనున్న బాలశక్తి, బాల కల్యాణ్ పురస్కార్ అవార్డులకు ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. బాలశక్తి పురస్కార్ అవార్డుకు గాను రూ.లక్ష నగదు బహుమతితో పాటు పతకం ఉంటుందని, ఐదేళ్ల నుంచి 18 ఏళ్లలోగా ఉన్న వారు అర్హులని, ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. బాలకల్యాణ్ పురస్కార్ అవార్డుకు గాను వ్యక్తిగత సంస్థలకు ఇవ్వడం జరుగుతుందని, రూ.5లక్షలు న గదు బహుమతితో పాటు పతకం ఉంటుందని, వ్యక్తిగతంలో రూ.లక్ష, బహూకరించడం జరుగుతుందన్నారు. 18 ఏండ్ల వయస్సు పైబడి ఏడేళ్ల అనుభవం కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధి వం టి సేవా రంగాల్లో ఏడేళ్లకు తక్కువ ఉండరాదని, సంస్థల వారు సేవలు అందించిన నిరూపణలు కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో www.nca.wcd.nic.in చేసుకున్న దరఖాస్తు ప్రింట్ కాపీని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...