సమిష్టిగా పనిచేద్దాం


Thu,September 5, 2019 01:58 AM

-30 రోజులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్దాం
-గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం
-భావితరాలకు బాటలు వేద్దాం
-జిల్లా స్థాయి సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో పండుగలు జరుపుకున్నంత ఉత్సాహంగా, సంతోషం గా 30 రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గ్రామ పంచాయితీల అభివృద్ధికి పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నదని, భావితరాల భవిష్యత్ కో సం నాయకులు ప్రజల ను భాగస్వాములను చే యాలన్నారు. 30 రోజు ల గ్రామ పంచాయతీ ప్ర త్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై బుధవా రం నాగవరం సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో ఎం పీపీలు, జెడ్పీటీసీలు, స ర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, పంచాయతీ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి సింగిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో 30 రో జుల కార్యక్రమాన్ని అమలు చేయనున్నారన్నారు. మ నిషికి రూ.1600 చొప్పున జనాభా ప్రాతిపదికన ప్రతి నెలా డబ్బులు విడుదల చేస్తుందని చెప్పారు. గ్రామా ల్లో పారిశుధ్య కార్మికులకు రూ.8,500 వేతనాలు పెంచి పల్లెలు పరిశుభ్రతకు దర్పణం పట్టేలా మార్చేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. 30 రోజుల్లో గ్రామాల స్వరూపమే మారిపోతుందని చెప్పారు. శ్మశాన వాటికల ఏర్పాటు, పాతబావులు పూడ్చడంలాంటివి పంచాయతీల పరిధిలోకి రానున్నాయన్నారు.

విదేశాలకు వె ళ్లిన వారి నుంచి గ్రామాభివృద్ధికి సహకారం తీసుకుని అభివృద్ధి చేసుకుంటే వారికి నమ్మకం పెరుగుతుందన్నా రు. హరితహారంపై మనస్సు పెట్టి పని చేస్తే ఫలితాలు తప్పనిసరిగా వస్తాయని, గతంలో గ్రామానికి ఉన్న 40 వేల మొక్కల లక్ష్యాన్ని సడలించి, మీ గ్రామాల స్థాయిని బట్టి ఎన్ని మొక్కలు నాటుతారో మీ మనస్సుకే వదిలివేశామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పేపర్, బట్ట సంచుల వినియోగాన్ని పెంపొందించుకునేలా ప్రజలను నడిపించాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. మహిళా సంఘాల సభ్యుల ను భాగస్వాముల ను చేసి విజయవంతంగా కొనసాగించాలని కోరారు. ఇ ప్పటి వరకు సర్పంచులు గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసిన నిధులను తీసుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ముగ్గురు సభ్యుల తీర్మాణం మేరకు ఈ నిధులు తీసుకునే వెసలుబాటును సర్పంచులకు కల్పించామని, ఇప్పటి నుంచి పెట్టే నిధుల ఖర్చును నేరుగా చేసుకోవచ్చని చెప్పారు.

ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి..
సీఎం కేసీఆర్ నిర్ణయించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఆశించిన అభివృద్ధి కంటే ఎక్కవగా పనులు జరుగుతాయన్నారు. గ్రామాలకు ముందే నిధులు కూడా మంజూరు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరసలో నిలబెట్టేందుకు మనసు పెట్టి పని చేయాలని కోరారు.

జీపీలకు నిధులు..
గ్రామ పంచాయతీలకు ఈ నెల 3వ తేదీన నిధులు విడుదల చేయడం జరిగిందని, ఆయా గ్రామ పంచాయతీల ఖాతాలో నిధులు జమ అయ్యాయని కలెక్టర్ శ్వేతామొహంతి తెలిపారు. ఈ మేరకు కోటి రూపాయలకు పైబడి వచ్చిన గ్రామ పంచాయతీలు మూడు, రూ.50 లక్షల నుంచి కోటి లోపు 33, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు 82, రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు 27, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలలోపు 35, రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలలోపు 34, రూ.5 లక్షలు వచ్చిన చిన్న గ్రామాలు రెండు మాత్రమే ఉన్నాయని వివరించారు. గ్రామాల్లో ప్రధానంగా రోడ్ల వెంట హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరు మొక్కల చొప్పున నాటించాలని, ఉపాధి హామీలో మస్టర్ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలోనూ వారం రోజుల కంటే మస్టర్లు పెండింగ్‌లో ఉండటానికి వీలులేదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జెడ్పీ సీఈవో నరసింహులు, జేసీ వేణుగోపాల్, డీపీవో రాజేశ్వరి, ఆర్డీవో చంద్రారెడ్డి, ప్రత్యేక అధికారులు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...