యువకుడి అదృశ్యం


Thu,September 5, 2019 01:55 AM

నాగర్‌కర్నూల్ క్రైం : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓరుగంటి భాస్కర్(30) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఏఎస్‌ఐ చంద్రయ్య తెలిపారు. భార్య కల్పనతో గొడవపడి ఆగస్టు 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన భాస్కర్ తిరిగి ఇంటికి రాలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోయిం దన్నారు. తాగుడుకు బానిసైన భాస్కర్ భార్యతో ఘర్షణ పడుతుండేవాడన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...