చెరువులో పడి మహిళ మృతి


Thu,September 5, 2019 01:54 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన మహిళ చెరువు నీటిలో మునిగిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. అంకిరావుపల్లి గ్రామానికి చెందిన ఎల్లపోగు పుల్లయ్య కూతురు ఎల్లమ్మ (25) గ్రామ సమీపంలోని ఉల్చాల చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. అయితే చెరువు నీటిలో బట్టలున్న బకెట్ మునిగిపోవడంతో నీటిలోకి దిగి ఎల్లమ్మ గల్లంతైనట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు ఆమె కూడా మునిగిపోయింది. మృతదేహం బుధవారం నీటిలో తేలడంతో స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చారన్నారు. సంఘటనా స్థలాన్ని గిర్దావర్ రాజేశ్వరి, వీఆర్వో వెంకటేశ్, వీఆర్‌ఏ ఆంజనేయులు పంచనామా నిర్వహించి పోలీసులకు సమాచారం అందించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...