వ్యాధులపై సమరం


Mon,August 26, 2019 02:01 AM

-కుష్ఠు, క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
-ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు సహకరించాలని పిలుపు
-వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు
-జిల్లా వ్యాప్తంగా 558 టీమ్‌ల ఏర్పాటు
-వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యం, మందులు
-నేటి నుంచి 14 రోజుల పాటు ఇంటింటి సర్వే

వనపర్తి ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ప్రస్తుతం సమాజంలో ప్రజల్ని పీడుస్తున్న కుష్ఠు, టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించి వా రికి ఉచితంగా వైద్యాన్ని అందించి వ్యాధి ని తరిమేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 558 సర్చ్ టీ మ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి టీమ్‌లో ఏఎన్‌ఎం, హెల్త్ సూపర్‌వైజర్, ఆశ కార్య కర్తలు ఉంటారు. ప్రతి ఒక్కరినీ పరీక్షించి వ్యాధి గ్రస్తులను గుర్తిస్తారు. ఈ మేరకు టీ బీ, కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. సెలవులు మినహాయించి 14 రోజులపాటు జిల్లాలో 558 సర్చ్ టీమ్‌లు సర్వే చేయనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 600 మంది క్షయ వ్యాదిగ్రస్తులున్నారు. వీరితో పాటు మరో 35 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు. వెయ్యి మందికి ఒకరు చొప్పున ఆరోగ్య సిబ్బంది జిల్లాలోని ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేయనున్నారు.

టీమ్‌లో ఒక ఆశ, ఒక వలంటీర్ ప్రతిరోజు 20 ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 25 ఇళ్లను ఉదయం 6:30 నుంచి 9:30 గంటల వరకు సర్వే చేస్తారు. ఇంటిని సందర్శించిన సర్చ్ టీమ్ ఇంటిలో 2 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తిని పరీక్షిస్తారు. ఆశ అయితే ఇంటిలోని మహిళలను, వలంటీర్ అయితే మగ వ్యక్తులను క్లుప్తంగా పరిశీలిస్తారు. అదేవిధంగా కుష్టు వ్యాధికి, టీబీకి సంబంధించి సర్పంచ్, ప్రజాప్రతినిధులు, యువతతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏగ్రామంలో అయినా సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోతే సర్చ్ టీమ్ సభ్యులు మరోసారి ఆ ఇంటిని సందర్శించి పరీక్షించనున్నారు. ఏవ్యక్తి కూడా తప్పిపోకుండా అందరినీ పరీక్షించాల్సిన బాధ్యత సర్చ్ టీమ్‌లదే.

ఎవరికైనా కుష్ఠు, టీబీ అనుమానితులు ఉంటే వారి పేర్లు సేకరించి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ వద్దకు పంపించి నిర్ధారిత పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. రోగ నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు ఇవ్వడంతోపాటు వారి నుంచి రోగం పూర్తిగా నయం అయ్యేంత వరకు వైద్యం అందించనున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఏఒక్కరూ కూడా మిగిలిపోకుండా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు స భ్యులు, కులమత పెద్దలు అంద రూ సహకరించాలని వైద్యారోగ్యశాఖాధికారులు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా యువకులు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సమాజంలో దాగి ఉన్న కుష్ణు, క్షయవ్యాధి గ్రస్తులను బయటకు తీయాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.

కుష్టు వ్యాధి వ్యాప్తి ఇలా
కుష్టువ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రె అనే సూక్ష్మజీవి వల్ల సోకుతుంది. ఈవ్యాధి సోకి మందులు వాడనటువంటి వ్యక్తి నుంచి ఇతరులకు రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే వ్యక్తులకు సోకుతుంది. ఈవ్యాధి లక్షణాలు చర్మంపై కాలిపోయిన మచ్చలు లేదా రోగి కలర్ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలపై స్పర్శ జ్ఞానం ఉండదు. చమట రాదు, వెంట్రుకలు ఉండవు. ఇలాంటి లక్షణాలు కలిగిన మచ్చలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యాధికారులు, ఆశ, ఏఎన్‌ఎంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులను కానీ సందర్శించి మందులను వాడాలి. మందులు వాడినట్లయితే ఎ లాంటి అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. సకాలంలో మందులు వాడనట్లయితే వ్యాధి తీవ్రత పెరిగి క్రమంగా నరాలపై ప్రభావం చూపడం వల్ల అంగవైకల్యం ఏర్పడి సమాజంలో కుష్టు రోగులపై వివక్ష ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంభదశలోనే గుర్తించి వారికి ప్రభుత్వం ద్వా రా అందించే ఉచిత మందులను వాడినట్లయితే ఎలాంటి అంగవైకల్యం ఏర్పడదని, ఎలాంటి వివక్షతకు గురికారనేది వైద్యశాఖాధికారులు పేర్కొంటున్నారు.

క్షయవ్యాధి లక్షణాలు ఇలా..
క్షయవ్యాధి లక్షణాలు 2 వారాలకు మించి దగ్గుతోపాటు రక్తం పడడం, సా యంత్రం వేళలో జ్వరం రావడం, బరువు తగ్గటం, ఆకలి లేకపోవడం, మనిషిలో పె రుగుదల లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెడపై వాచిన గ్రంధులు, గ డ్డలు, క్షయవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తో కలిసి ఉండడం వల్ల సోకుతుంది. లిం ప్ గ్రంధులు వాపు రావడం ఇవన్నీ కూడా క్షయవ్యాధి లక్షణాలు కలిగిన వ్య క్తులను పీహెచ్‌సీ సిబ్బందిని సంప్రదించి తగిన సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...