ఆల్మట్టి, నారాయణపురకు వరద ప్రవాహం


Mon,August 26, 2019 01:59 AM

కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వానలు కురుస్తుండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద క్రమేపీ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పడిపోయినప్పటికీ, శని, ఆదివారాలలో కురిసిన వానలకు ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 23,991 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 23,991 క్యూసెక్కులు నమోదైంది. 129.72 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 128.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపుర ప్రాజెక్టుకు 25,288 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 7,783 క్యూసెక్కులు నమోదైంది, 37.64 టీఎంసీల సామర్థ్యం కలిగిన నారాయణపురలో ప్రస్తుతం 37.12 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...