క్రీడలతో మానసిక వికాసం


Mon,August 26, 2019 01:58 AM

వనపర్తి క్రీడలు: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడుతాయని విద్యాశాఖ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం వనపర్తి బాలుర డిగ్రీ కళాశాల సమీపంలోని ఇండోర్ స్టేడియంలో తైక్వాండో జిల్లా ప్రధానకార్యదర్శి ప్రభాకర్‌గౌడ్ ఏర్పాటు చేసిన 65వ స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ జిల్లాస్థాయి తైక్వాండో కరాటే పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను పరిచయం చేసుకుని స్పైరింగ్‌ను ప్రారంభించారు. పోటీలకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల విద్యార్థులు 150 మంది స్పైరింగ్ విభాగంలో పాల్గొన్నారు. ఏఎంవో మాట్లాడుతూ విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. గేమ్స్ ఆడటం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన అత్యధిక మంది విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్ పరికరాలతో సమయం గడపకుండా సాధ్యమైనంత వరకు ఆడటానికి విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ఈ పోటీలలో జిల్లాస్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి తైక్వాండో కరాటే పోటీల్లో ఆడనున్నట్లు మాస్టర్ తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు ఆయనతోపాటు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ సుధీర్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో పీడీ సురేందర్‌రెడ్డి, తైక్వాండో సీనియర్స్ యుగేందర్, బీ రవికుమార్, వెంకటేష్, రమేష్‌రెడ్డి, మహేష్, పరశురాం, శివ, సోహేల్, మధుకృష్ణ, యశ్వంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...