శ్రీశైలం డ్యాంకు తగ్గిన వరద


Mon,August 26, 2019 01:58 AM

అమ్రాబాద్ రూరల్ : జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం వరద తగ్గింది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ నెమ్మదిగా వచ్చి చేరుతుంది. 17 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తుండటంతో డ్యాం నిండుకుండలా కన్పిస్తుంది. పై నుంచి వస్తున్న వరద ఆధారంగా దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నిలుపుదల చేశారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్‌కు 24,426 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 268.725 టీఎంసీల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం పొద్దుపోయే నాటికి 882.50 అడుగులు కాగా 202.426 టీఎంసీల నీరు ఉన్నది. మహాత్మాగాంధీ లిప్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 20వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు విడుదలవుతుంది. ఆదివారం టీఎస్ ఎడమ పవర్‌హౌస్ ద్వారా విద్యుదుత్పత్తిని నిలపివేయగా శ్రీశైలం కుడిగట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ను కూడా నిలుపుదల చేశారు. శ్రీశైలం నుంచి అవుట్‌ఫ్లో ద్వారా 24,426 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ వైపు దిగువకు వదులుతున్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...