హరితవనాల్లా మార్చండి


Sun,August 25, 2019 02:32 AM

-నూటికి నూరు శాతం సాగునీరందిస్తా
-రైతులు సాగుపై దృష్టి సారించండి
-మోటర్లు, పైపులకు అయ్యే ఖర్చును భరిస్తా.. : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
-అంగన్‌వాడీ, శ్మశాన వాటికలకు శంకుస్థాపనలు, పామిరెడ్డిపల్లిలో సాగునీటి వనరులపై పరిశీలన

పెద్దమందడి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రామాల్లో విరివిగా మొ క్కలు నాటి గ్రామాలను హరితవనంలా మార్చాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి గ్రామాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయా గ్రామాల్లోని వైకుంఠ ధామం (శ్మశాన వాటికల)కు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రె డ్డి మాట్లాడుతూ అటవీశాతం తక్కువగా ఉన్నందువల్ల ఆశించిన మేర వర్షపాతం నమోదు కావడం లేదన్నా రు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్క లు నాటితే సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరడం ఖాయమన్నారు. అలాగే బలిజపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగట్టు తండాలో నూతన అంగన్‌వాడీ నిర్మాణానికి గాను భూమిపూజ చేశారు. గత ఎన్నికల్లో తం డా వాసులకు ఆలయ నిర్మాణం కోసం నిధులు ఇస్తానని హమీ ఇచ్చానని, దానికి కట్టుబడి బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం తన నిధుల నుంచి ఆలయ నిర్మాణానికి సహకారం చేస్తానని అన్నారు. అప్పటిలోగా ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించుకోవాలని సూచించారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు బసిరెడ్డి చెరువుకు సాగునీరు వచ్చేలా చూడాలని మంత్రిని కోరగా, తాత్కాలికంగా మోటర్ల సాయంతో చెరువులను నింపుతామని, కర్నెతండా లిఫ్ట్ ద్వారా శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. జంగమాయిపల్లిలో యాదవ కమిటీ హాల్ వద్ద కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి పూజలు చేశారు.

ఎగువ ప్రాంతాలకు సాగునీరందిస్తా..
భూ తల్లిపై నిలబడి చెబుతున్నా.. నూటికి నూరు పాలు సాగునీరు అందించే బా ధ్యత నాదే.. ఎగువ ప్రాంతాల్లో ని ప్రతి ఎకరాకూ సాగునీరంది స్తా.. అని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసానిచ్చారు. మం డలంలోని పామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట పక్కన ఉ న్న ఎగువ పొలాలకు నీరు అం దించేందుకు ఉన్న మార్గాలను రైతులతో కలిసి పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ పా మిరెడ్డిపల్లి వైరాల చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని పై భాగంలో ఉన్న పొలాలకు తీసుకెళ్లేందు కు మోటర్లు, పైపులు అవసరమవుతాయని, రైతులు తోడ్పాటైతే తాను కూడా స్వంత ఖర్చులు ఇస్తానన్నా రు. రైతులు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని, 25 హెచ్‌పీ మోటర్లు, 2, 6 ఇంచుల పైపులు ఇప్పిస్తానని, వాటి ద్వారా ఎత్తు ప్రాంతంలో ఉన్న కుంటలను నింపుకోవాలని సూచించారు. కావాల్సిన పైపులపై స్థా నిక నాయకులు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. అనంతరం పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలకేంద్రంలోని చెరువు, దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, రా మాపల్లి చెరువులకు వెళ్లే నీటి ప్రవాహాన్ని పరిశీలించా రు.

నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉందని, రేపటిలోగా ఇంకో పైపు వేసి నీటి ప్రవాహాన్ని పెంచాలని జగదీశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. వాటికి అయ్యే ఖర్చు కూడా స్వతహాగా అందజేస్తానని తెలిపారు. ఇందుకు గాను ఆయా గ్రామాల రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపా రు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లో కనాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచులు జయంతి, సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాష్‌రెడ్డి, సింగిల్‌విండో మా జీ అధ్యక్షుడు సత్యారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జి ల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు గట్టుయాదవ్, గొ ర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, ఎంపీటీసీ గిరమ్మ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుమార్‌యాదవ్, పీడీ గణేశ్, తాసిల్దార్ ఘాన్షీ రాం, ఎంపీడీవో నాగశేషాద్రిసూరి, ఎంఈవో జయశంకర్, ఈవోపీఆర్‌డీ భానుప్రసాద్, మాజీ మున్సిపల్ చై ర్మన్ రమేశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ గట్టుయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ ఇందిరమ్మ, నాయకులు శశివర్దన్‌రెడ్డి, కొండలు, సత్యనారాయణ, పుల్లన్నయాదవ్, కుమార్‌యాదవ్, లక్ష్మణ్‌గౌడ్, భీంరెడ్డి, శీలయ్యగౌడ్ ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...