ఆగిన లారీని ఢీకొని ఒకరి మృతి


Sun,August 25, 2019 02:30 AM

మరికల్ : మరికల్ మండల పరిధిలోని లాల్‌కోట చౌరస్తా సమీపంలో శనివారం రాత్రి 8 గంటలకు ఆగిఉన్న లారీని మోటర్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెంది, మరొకరు గాయాలపాలయ్యారు. ఈ సంఘటనకు సబంధించిన మరికల్ పోలీసులు కథనం ప్రకారం.. నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్‌కు బైక్‌పై అప్తబ్‌హుస్సేన్(32), ఫరీద్ హుస్సేన్ (34)లు వెళ్తున్నారు. లాల్‌కోట చౌరస్తా దగ్గర ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టారు. అప్తబ్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫరీద్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తరలించినట్లు ఏఎస్సై సురేంద్రబాబు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...