వివాహిత ఆత్మహత్య


Sun,August 25, 2019 02:29 AM

మక్తల్ రూరల్ : కడుపునొప్పి భరించలేక మక్తల్ మండలం తిర్మలా పూర్‌కు చెందిన నర్సమ్మ అలియాస్ గోవిందమ్మ(27) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు మక్తల్ ఎస్సై బీ అశోక్‌కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించోలి ప్రాంతానికి చెందిన నర్సమ్మకు తిర్మలాపూర్‌కు చెందిన వెంకట్రాములుకు ఇచ్చి ఆరేండ్ల క్రితం వివాహం చేశారు. ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న నర్సమ్మ ఈనెల 23న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌లోని దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందిందన్నారు. మృతురాలు నర్సమ్మ తండ్రి కావలి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...