రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


Sun,August 25, 2019 02:29 AM

-రెండు రోజుల్లో ఆరు ట్రాక్టర్లు పట్టుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు
కోసి ్గటౌన్ : ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్పెషల్ పార్టీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. రాత్రి వేళల్లో ఇసుక రవాణా పెద్ద మొత్తంలో సాగుతోందన్న సమాచారంతో రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం నుంచి వరుసగా ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నారు. స్పెషల్ పార్టీ వచ్చిందన్న సమాచారంతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారులు పరారవుతున్నారు. కానీ అక్కడక్కడ కొన్ని ట్రాక్టర్లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ అక్రమ ఇసుక వ్యాపారులకు ఏ అధికారి ఎక్కడికి వస్తున్నాడన్న సమాచారం పక్కాగా ఉంటుందంటే పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఎస్‌బీ పోలీసుల అండతో జరుగుతుందన్న వాదన బలంగానే ఉంది. ఏది ఏమైనా ఈ అక్రమ ఇసుక రవాణా మాత్రం జోరుగా సాగుతోంది.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...