వర్షానికి కూలిన మట్టి మిద్దె


Sun,August 25, 2019 02:29 AM

ఊట్కూర్ : శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని 1వ వార్డులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బాధితుడు పెద్దపీర్ల మహ్మద్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని 1వ వార్డులో నివాసం ఉంటున్న పెద్దపీర్ల మహ్మద్‌కు చెందిన మట్టి మిద్దె శుక్రవారం రాత్రి కూలిపోయిందన్నారు. మట్టి మిద్దె ఇంట్లో దాచిన దుస్తులు, తిండి గింజలు మట్టిలో కలిసిపోయాయన్నారు. దీంతో కుటుంబానికి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న మరో ఇంట్లో నిద్రించడంతో ప్రమాదం తప్పిందన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, వార్డు సభ్యుడు షేక్ షమీ పరామర్శించారు. ఘటనపై ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...