బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు


Sun,August 25, 2019 02:28 AM

మదనాపురం (కొత్తకోట) : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీలు విషం చిమ్ముతున్నాయని, దేశంలో 19 రాష్ర్టాల్లో బీజేపీ పాలన కొనసాగిస్తుందని, అక్కడ ఎందుకు ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని, వాటిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇంతలా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలంతా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలన్నారు. శనివారం కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామ సమీపంలో ఉన్న ఏనుకుంట రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ.. వారి ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తామంతా కృషి చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల కోసం అప్పటి ప్రభుత్వాలు సంవత్సరానికి రూ.కోటి మాత్రమే ఇచ్చేవారని, నేడు ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అదే బడ్జెట్‌ను రూ.వెయ్యికోట్లకు పెంచారని పేర్కొన్నారు. మదనాపురం, కొత్తకోట మండలాల్లో గత మూడేళ్ల కాలంలో మత్స్యకారులు రూ.25కోట్లు ఆర్థికాభివృద్ధిని సాధించారన్నారు. అనంతరం కనిమెట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి రూ.32వేలు, నాగేశ్వర్‌రెడ్డికి రూ.18వేల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి రాధా రోహిణి, కోదండరాం, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చై ర్మన్ జగన్మోహన్‌రెడ్డి, మత్స్యకారుల సం ఘం మండలాధ్యక్షుడు రంగస్వామి, స ర్పంచ్ బుచ్చన్న, నాయకులు ప్రశాంత్, చెన్నకేశవరెడ్డి, నిర్మల, వెంకట్‌రెడ్డి, భీం రెడ్డి, బాలనారాయణ, విశ్వేశ్వర్, కొండారెడ్డి, శ్రీనుజీ, బాలకృష్ణ, మిషేక్, వసీంఖాన్, సుభాష్, సత్యంయాదవ్, మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...