ఆత్మకూరు చెరువుకు చేరిన కృష్ణమ్మ


Sat,August 24, 2019 01:55 AM

-ఫలించిన ఎమ్మెల్యే చిట్టెం కృషి
-పూజలతో స్వాగతం పలికిన నాయకులు
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఆత్మకూరు చెరువుకు కృష్ణమ్మ నీళ్లు చేరుకున్నాయి. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల నుంచి వచ్చిన కృష్ణానీటికి శుక్రవారం ఎంపీపీ బం గారు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచనలు, ఆదేశాలతో ఎట్టకేలకు ఆత్మకూరు చెరువుకు నీటిని రప్పించుకోగలిగామన్నారు. పరమేశ్వరస్వామి చెరువుకు నీళ్లు తీసుకొచ్చేందుకు కంకణబద్ధులై కృషి చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే చిట్టెం నేతృత్వంలో త్వరలో రోడ్డు విస్తరణ, డివిజన్ కళను సాకారం చేసుకుంటామన్నారు. అలాగే రామన్‌పాడ్ గేట్ మరమ్మతును అత్యవసరంగా చేయించడంతో తిప్డంపల్లి వైపు ఉన్న కాలువకు నీరు పారుతుందన్నారు. పదిరోజుల్లో చెరువుకు పూర్తిస్థాయి నీరొస్తుందని మాజీ ఎం పీపీ శ్రీధర్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీను, రమేష్, రాజశేఖర్, లక్ష్మయ్య, సురేష్, శ్రీను, మల్లేష్, రామకృష్ణ, రమేశ్, సత్తి, రవి, భాను, మాసన్న తదితరులున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...