అడవులను అభివృద్ధి పర్చాలి : ఏకే సిన్హా


Sat,August 24, 2019 01:55 AM

వనపర్తి రూరల్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రిజర్వ్ ఫారెస్టు బ్లాక్‌ల పరిధిలోని పది ఎకరాలలో సెమీ మెకానికల్ పద్ధతిలో అడువులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే సిన్హా సూచించారు. శుక్రవారం జిల్లా సమీపంలోని మర్రికుంట గ్రామంలోని ఏకో పార్కును కలెక్టర్ శ్వేతామొహంతి, డీఎఫ్‌వో బాబ్జిరావులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకే అడువులలో ఎండిపోయిన చెట్లను తీసివేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి మంచి మొక్కలను నాటాలన్నారు. ప్రతి రిజర్వ్ ఫారెస్టు బ్లాక్‌కు ఒకటి చొప్పున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎకో పార్కును అనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్టులో అడవిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. అడవి మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. అంతకుముందు కలెక్టర్ శ్వేతామొహంతి మాట్లాడుతూ జిల్లాలో ఎకో పార్కు పక్కన ఉన్న రిజర్వ్ ఫారెస్టుతో పాటు పాన్‌గల్, ఖిల్లాఘణపురం, బుద్దారం ప్రాంతాలలో రిజర్వ్ ఫారెస్టు బ్లాక్‌లు ఉన్నట్లు సీసీఎస్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. కొత్తకోట నుంచి వనపర్తికి వెళ్లే రహదారి ఇరువైపుల హరితహారం కింద అవసరమైన పెద్ద మొక్కలు నాటించడంతో పాటు కంచె ఏర్పాటుకు తాను నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆయనను కోరారు. కార్యక్రమంలో పారెస్టు రెంజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రంగసముద్రం కట్టపై మొక్కలు నాటాలి..
పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట దెబ్బతినకుండా పర్యాటకులను ఆకర్శించే విధంగా మొక్కలను నాటాలని ఏకే సిన్హా సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ శ్వేతామొహంతితో కలిసి రంగసముద్రం రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున, కట్ట చుట్టూ మొక్కలను నాటాలని ఆయన సూచించారు. వీరి వెంట జిల్లా అటవీ శాఖాధికారి బాబ్జీరావు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...