జోగుళాంబ ఆలయంలో చండీ హోమం


Sat,August 24, 2019 01:53 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : శ్రీకృష్ణాష్టమి ప్రత్యేక దినం పురస్కరించుకొని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సముదాయంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్ల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా మంత్రోశ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య కమనీయ, రమణీయంగా సాగింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పట్టణంలోని జోగుళాంబ ఆలయంలో శుక్రవారం చంఢీ హోమంతో పాటు సంద్యా వేళ రథోత్సవం నిర్వహించారు. అమ్మ వారికి అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి బంగారు అభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు మొదలగు పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరో వైపు ఆలయంలోని యాగశాలలో ఉదయం సామూహిక చండీహోమాలు నిర్వహించారు. చండీ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయాన జోగుళాంబ ఆలయంలో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. జోగుళాంబ దేవి రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రావణమాస శుక్రవారాన్ని పురష్కరించుకొని భక్త యాత్రికుల అధిక సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. భక్తులు వారి శక్తి కొలది కానుకలు ఆలయానికి సమర్పించుకున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...