మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం


Sat,August 24, 2019 01:53 AM

రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. మొదటి రోజు జరిగిన మ్యాచ్‌లో బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 4-2 స్కోర్ తేడాతో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మెదక్ జట్టు 10-0 తేడాతో భద్రాద్రి కొత్తగూడెంపై, కరీంనగర్ జట్టు 6-2 తేడాతో నల్గొండపై, వరంగల్ అర్బన్ జట్టు 17-3 తేడాతో మహబూబ్‌బాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 14-0 తేడాతో నిర్మల్‌పై, మెదక్ జట్టు 13-0 తేడాతో వరంగల్ అర్బన్ జట్టుపై, కరీంనగర్ జట్టు 6-2 తేడాతో నల్గొండ జట్టుపై విజయం సాధించింది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...