శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్


Sat,August 24, 2019 01:53 AM

మదనాపురం : శాంతి భద్రతలు ప రిరక్షణకే గ్రామాల్లో కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. శుక్రవా రం మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌సెర్చ్ ని ర్వహించారు. ఈ సందర్భంగా 400 ఇండ్లలో తనిఖీలు చేసి సరై న ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ అ పూర్వరావు గ్రామస్తులతో మాట్లాడుతూ కొత్తవ్యక్తులు ఇండ్లు అద్దెకు కావాలని వస్తే పూర్తి వివరా లు తెలుసుకోవాలని చెప్పారు. ఆధార్‌కార్డు తదితర ధ్రువపత్రాలను పరిశీలించాకే ఇండ్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దొంగతనాలను అరికట్టాలంటే గ్రా మంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, ఇందుకు దా తల సహకారం కావాలన్నారు. కార్యక్రమంలో డీ ఎస్పీ సృజన, సీఐ బండారీ శంకర్, మదనాపురం, అమరచింత, రేవల్లి, శ్రీరంగాపురం, ఖి ల్లాఘణపురం ఎస్‌ఐలతో పాటు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...