నీలి విప్లవం దిశగా


Fri,August 23, 2019 12:55 AM

-మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ
-జిల్లాలో ఐదు జలాశయాలు..
-1249 చెరువులు, కుంటలు గుర్తింపు
-2.52 కోట్ల చేప విత్తనాలు లక్ష్యం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో చేప విత్తనాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చెరువులు, కుంటల్లో చేప విత్తనాలు విడుదల మొదలైంది. జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లతో ఇక్కడి చెరువులకు, రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. క్రమంగా ఎత్తిపోతల పథకాలతో నిండిన చెరువులకు వరుస క్రమంలో సోమవా రం నుంచి చేప విత్తనాలను విడుదల చేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ ఏడాది సీజన్‌లో వర్షాలు కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ కృష్ణానదికి వరదలు పోటెత్తడంతో జిల్లాలోని చె రువులకు సాగునీరందుతోంది. 20 రోజులకు పైగా భీ మా-2 ఎత్తిపోతల పథకంలో మోటర్లు నిరంతరాయ ంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఎంజీకేఎల్‌ఐ పథకం నుంచి కూడా నీరు చెరువులకు చేరుతుండటంతో చెరువులు, కుంటలు నిండి చేపల పెంపకానికి అనువుగా మారాయి. దీంతో మత్స్యకారులకు ఊరటలభించింది.

జిల్లాలో 1254 చెరువులు, జలాశయాలు
జిల్లా పరిధిలో చేపల పెంపకానికి అనువుగా 5 జలాశయాలు, 1249 నీటి పారుదలశాఖ పంచాయతీరాజ్‌ శాఖ చెరువులున్నాయి. ఈ ఏడాది వానాకాలం వర్షాలు సహకరించక పోయినా కృష్ణానదికి వరదలు పోటెత్తడంతో ఎత్తిపోతల పథకాలు ద్వారా చెరువులకు నీరందుతోంది. ఇప్పటికే జిల్లాలో చెరువులు నిండాయి. ఇంకా పూర్తి స్థాయిలో మొత్తం చెరువులు నిండేందుకు కొంత సమయం పడుతున్న క్రమంలో చేప విత్తనాలు వదిలేందుకు మత్య్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా చేప విత్తనాల పంపిణీని చేపట్టి ప్రారంభించిన సంగతి విధితమే. ఈ క్రమంలో జిల్లాలోను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి లాంఛనంగా ఉచిత చేప విత్తనాల పంపిణీ చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు చేపడుతున్నారు.

జిల్లాకు 2.52 కోట్ల విత్తనాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, జలాశయాల్లో ఉచిత చేప విత్తనాలను వదిలేందుకు మత్స్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది అయిదు జలాశయాలతో పాటు మరో రెండు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాలు(జూరాల, శ్రీశైలం)లను కలుపుకుని 1247 చెరువులు, కుంటలకు 2 కోట్ల 52 లక్షల చేప విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. రామన్‌పాడ్‌, శంకరసముద్రం, రంగసముద్రం, ఏనుకుంట, గోపాల్‌దిన్నె రిజర్వాయర్లలోను ఉచిత చేప విత్తనాలను వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీరంగాపురం రిజర్వాయర్‌లో చేప విత్తనాలను వదల డం పూర్తి చేశారు. మిగతా రిజర్వాయర్లు, నిండిన చెరువుల్లో సోమవారం నుంచి విత్తనాలను వదిలేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా పరిధిలో ఉన్నంత వరకు శ్రీశైలం, జూరాల బ్యాక్‌ వాటర్‌లోను ఉచిత చేప విత్తనాలను వదిలేందుకు ఏర్పాట్లు చేశారు.

30 చెరువులకు నీరు..
ఇటీవల జూరాలకు పోటెత్తిన వరద ఉధృతితో భీమా ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, పాన్‌గల్‌, వీపనగండ్ల మండలాల పరిధిలోని గ్రామాల చెరువులకు భీమా ఎత్తిపోతల పథకం సాగునీరు అందుతుంది. ప్రధానంగా ఈ పథకంలో చెరువులను నింపుకుని రైతులు సాగుచేసుకుని వెసులుబాటు ఎక్కువగా ఉన్నది. ఈమేరకు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 30 చెరువులు నిండినట్లు అధికారులు గుర్తించారు. ముందుగా నీటితో నిండిన చెరువుల్లో చేప విత్తనాలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. మరికొన్ని చెరువుల్లోను కొంతమేర నీరునప్పటికీ మూడో వంతు నీరు చేరిన చెరువుల్లోనే విత్తనాలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇందుకు తాసిల్దార్‌, గ్రామ మత్స్య సహకార సంఘం తీర్మానం చేసిన అనంతరమే చేప విత్తనాల పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...