సీనియర్‌ జర్నలిస్టు హన్మంత్‌రెడ్డికి ఎమ్మెల్యే ఆల నివాళి


Fri,August 23, 2019 12:52 AM

దేవరకద్ర రూరల్‌: మండలంలోని వెంకటాయపల్లికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు హన్మంతురెడ్డి బుధవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు గురువారం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆయన భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాటాడారు. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. అదేవిధంగా టీయూడబ్ల్యూజే జిల్లా అద్యక్షుడు గోవర్దన్‌గౌడ్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు మణిప్రసాద్‌, కార్యదర్శి బాలకృష్ణ, వివిధ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...