హరితహారంలో భాగస్వాములు కావాలి


Fri,August 23, 2019 12:52 AM

ఖిల్లాఘణపురం : హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ డైరెక్టర్‌ గోపాల్‌శర్మ జోషి అన్నారు. గురువారం మండలంలోని సోలీపురం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌, హరితహారం కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ నిర్వహించి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో వాతావరణంపై అనేక రకాలుగా మార్పులు వస్తున్నాయని, దానివల్ల వర్షాలు కూడా సక్రమంగా కురవడం లేదని అన్నారు.

అందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. అదేవిధంగా మన చుట్టు ఉన్న పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని, అందుకు ప్రతి విద్యార్థి మంచిగా చదివి తల్లిదండ్రులకు, గ్రా మానికి, పాఠశాలకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రామిరెడ్డి, గ్రామస్తులు బాలీశ్వర్‌రెడ్డి, హెచ్‌ ఎం విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు పురేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సత్యశీలరెడ్డి, మునేందర్‌రెడ్డి, శ్రీను, చిన్నకురుమయ్య పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...