మట్టి వినాయకుడినే పూజిద్దాం


Fri,August 23, 2019 12:51 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ/ వనపర్తి సాంస్కృతికం : మట్టి గణపతి మహా గణపతి చెరువుమట్టితో చేసిన గణపతి ప్రతిమలను పూజిద్దామని తెలంగాణ రాష్ట్ర నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ప్రాజెక్ట్‌ అధికారిని సౌమ్య అన్నారు. గురువారం పట్టణంలోని బాలభవన్‌ సూపర్‌వైజర్‌ లావణ్య ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు తయారీ శిబిరానికి ముఖ్యఅతిథి గా హాజరై అందజేశారు. అనంత రం వివిధ మండలాల విద్యార్థుల కు మట్టి వినాయకుల ప్రతిమల ను తయారీ వివరిస్తూ తయారు చే సిన వినాయకుల ప్రతిమలను ఆ మె ప్రజలకు అందజేశారు. అదేవిధంగా మున్సిపల్‌ కమిషనర్‌ రజినికాంత్‌రెడ్డి మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడొద్దని, జల కాలుష్యం వల్ల జలచరాలకు ప్రమాదమని వివరించారు.

గణపతి పూజలో ఉపయోగించే 21 రకాల మొక్కలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయన్నారు. వాటిని మన పరిసరాల్లో పెంచుతూ పర్యావరణ సమత్యులతను కాపాడుకుద్దామన్నారు. అజ్జకొల్లు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు తయారు చేసిన వినాయకులకు ప్రథమ బహుమతి, జెడ్పీహెచ్‌ఎస్‌ ఈర్లదిన్నె కు ద్వితీయ బహుమతి, జెడ్పీహెచ్‌ఎస్‌ ఆరేపల్లి తృ త్రీయ బహుమతిలను అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ రజనీకాంత్‌రెడ్డి, విద్యాశాఖ ఏడీ నరహరి, ఎన్‌జీసీ స్టేట్‌ కోఆర్డీనేటర్‌ సుదర్శన్‌రావు, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, శ్రీనివాసులు, బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం తారాబాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...