శాంతించిన కృష్ణమ్మ


Fri,August 23, 2019 12:51 AM

అమ్రాబాద్‌ రూరల్‌ : కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర నుంచి వదద పూర్తిగా తగ్గడంతో ఎగువనున్న జూరాల గేట్లు మూసివేశారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం వరద జలాలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా జూరాల ప్రాజెక్టు ద్వారా తగ్గుతున్న వరద గురువారం నాటికి 40వేలకు పైగా క్యూసెక్కుల జూరాల నుంచి నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుండటంతో ప్రాజెక్టు నిండుకుండలా కన్పిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా నీటిని దిగువన ఉన్న సాగర్‌ వైపు ప్రాజెక్టు కుడి, ఎడుమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విడుదలైన నీటిని మాత్రమే వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జునసాగర్‌కు 87,972 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 268.725 టీఎంసీల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం సాయంత్రం పొద్దుపోయే నాటికి 884.40 అడుగులు కాగా 212.4385 టీఎంసీల నీరు ఉన్నది. 13 రోజులుగా విద్యుదుత్పత్తిని ప్రజావసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా 14 రోజులుగా ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగతున్నదని, ఒక యూనిట్‌ ద్వారా 150 మెగావాట్స్‌ మొత్తం 2700 మెగావాట్స్‌ విద్యుదుత్పత్తి కొనసాగుతున్నదని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. అమ్రాబాద్‌ మండలంలోని ఈగలపెంట తెలంగాణ శ్రీశైలం ఎడుమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...