ఘనంగా ఆర్‌బీవీఆర్‌ జయంతి


Fri,August 23, 2019 12:50 AM

మదనాపురం(కొత్తకోట): విద్య అనేది ప్రతిఒక్కరికీ అవసరమని, విద్యపట్ల దాతృత్వం కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి 151వ జయంతి సందర్భంగా గురువారం మండల పరిధిలోని రాయినిపేట స్టేజీ సమీపంలోని రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌బీవీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యపట్ల దాతృత్వం కలిగిన మహానుభావుడు రాజాబహదూర్‌ వెంకట్రామిరెడ్డి అని కొనియాడారు. ఇలాంటి వ్యక్తులు కోటికొకరు పుడతారని, మహానుభావులు అన్న పదానికి అర్థాన్ని ఇచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆరోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి విద్యా కుసుమాలను తయారు చేయాలనే సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా రెడ్డి హాస్టల్‌ను ప్రారంభించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 73ఏళ్ల తరువాత బేటి బచావో, బేటి పడావో అనే నినాదాన్ని కొందరు వినిపిస్తున్నారని, దాదాపు 100ఏళ్ల క్రితమే ఈ నినాదాన్ని చాటిన పుణ్యపురుషులు ఆర్‌బీవీఆర్‌ అని కొనియాడారు. అందరికి విద్యతో పాటు, బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేశారన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌, ట్రస్ట్‌ సభ్యులు జయప్రద, ఆర్‌బీవీఆర్‌ ప్రిన్సిపాల్‌ వీఎస్‌ఎన్‌ మూర్తి, జెడ్పీచైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, జెడ్పీవైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంత మౌనిక, ఎంపీటీసీ సభ్యురాలు రాధ, ఉప సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డి, సీడీసీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, గాడీల ప్రశాం త్‌, గిన్నె కొండారెడ్డి, సాక బాలనారాయణ, పాండురంగయ్య, జితేందర్‌గౌడ్‌, రవికాంత్‌రెడ్డి, దేవేందర్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...