పెద్దమందడి మండలానికి కృష్ణా జలాలు


Fri,August 23, 2019 12:49 AM

పెద్దమందడి: కేఎల్‌ఐ నుంచి గుడిపల్లి రిజర్వాయర్‌ ద్వారా బుద్దారం చెరువు అక్కడి నుంచి పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి, పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి గ్రామాలలోని చెరువులకు కృష్ణా జలా లు చేరుకున్నాయి. ఇప్పటికే రైతులు బోరుబావు ల సహాయంతో వరినాట్లు వే సుకొని చెరువు, కాలువల వెంట పొ లాలకు తుకాలు పోసుకొని సిద్ధం చేసుకున్నారు. గురువా రం కృష్ణజలాలు చూసి రైతుల కళ్లలో ఆనందం పరవసించింది. వర్షకాలం మొ క్కార్తి వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉండడంతో కృష్ణా నీరు రావడం వల్ల భారీగా వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతాయని రైతులు పేర్కొన్నారు.

కేఎల్‌ఐ నీరు రావడంతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ మెగారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, వెల్టూర్‌ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, పల్లె సత్యనారాయణ, పెద్దమందడి గ్రామ కమిటీ అధ్యక్షుడు సేనాపతి పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి బుద్దారం వరకు కాలువను పరిశీలించారు. కాలువలో ఎక్కడ చెత్త చెదారం, ముండ్ల కంపలు లేవని మరో వారం రోజులలో అన్ని చెరువులకు నీరు చేరుతుందని తెలిపారు. శుక్రవారం నుంచి కాలువలో నీరు మరింత వేగంగా వస్తాయని వారు తెలిపా రు. మండలానికి కృష్ణా నీరు చేరుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...