కంచిరావుపల్లిలో కూలిన ఇల్లు


Thu,August 22, 2019 01:54 AM

పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కంచిరావుపల్లిలో ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక దళితవాడలో నరేశ్ తన అక్క జ్యోతి, ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తున్నారు. అర్ధరాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఇల్లు కూలుతున్న శబ్ధానికి అప్రమత్తమైన వారు వెంటనే బయటకు పరుగెత్తడంతో ప్రాణ నష్టం తప్పింది. దీంతో ఇంట్లోని వస్తువులు ధ్వంసమై లక్ష రూపాయల ఆస్థి నష్టం సంభవించినట్లు బాధితుడు నరేశ్ తెలిపాడు. గ్రామ నాయకులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించారు. వీఆర్‌వో పంచనామా నిర్వహించి, తాసిల్దారుకు నివేదిక సమర్పించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...