నాలుక కోసుకొని భార్య చేతిలో పెట్టిన భర్త


Thu,August 22, 2019 01:53 AM

అమ్రాబాద్ రూరల్ : ఓ వ్యక్తి తన నాలుక కోసి భార్య చేతిలో పెట్టాడు. ఈ సంఘటన అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటు ంబీకులు తెలిపిన సమాచారం ప్రకారం.. అమ్రాబాద్ మండల పరిధిలోని సార్లపల్లి గ్రామానికి చెందిన చిగుర్ల చంద్రయ్య బుధవారం ఉదయం ఉన్నట్టుండి గొడ్డలికి పదును పెట్టాడు. తనకు తానుగా నాలుకను కోసుకొని భార్య చేతిలో పెట్టాడు. గమనించిన భార్య, బంధువులు మన్ననూర్ వైద్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించారు. అక్కడి నుంచి అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. వైద్యులను వివరణ కోరగా చంద్రయ్య ప్రాణానికి ఎలాంటి హాని లేదని తెలిపారు. అయితే చంద్రయ్య మానసిక స్థితి బాగోలేనట్టుగా ఉన్నాడని, కొన్ని సందర్భాలలో ఇంటి వద్ద పిచ్చిగా ప్రవర్తించేవాడని బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...