పీడీఎస్ బియ్యం లోడుతో ఉన్న డీసీఎం పట్టివేత


Thu,August 22, 2019 01:53 AM

గద్వాల క్రైం : గద్వాల శివారులోని అయిజ మార్గంలో పీడీఎస్ బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం లోడ్ డీసీఎం వాహనాన్ని అధికారులు వెంటనే గద్వాల టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే విచారణ ప్రారంభించిన పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ పీడీఎస్ బియ్యాన్ని అయిజలోని స్టాక్ పాయింట్ నుంచి ఓ డీలర్ 101 క్వింటాళ్లు యాక్షన్ (బిడ్) ద్వారా కొనుగోలు చేశారని తెలుసుకున్నారు. స్టాక్ పాయింట్ నుంచి బియ్యం కొనుగోలు చేసిన డీలర్ జిల్లా పౌర సరఫరా అధికారి నుంచి రిలీజింగ్ ఆర్డర్ చూయించడంతో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యం లోడు డీసీఎంను వదిలేశారు. అ యితే సంఘటనకు సం బంధించి ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారి ఒకరు స మాచారం చెబుతానని దాటవేస్తూ చివరికి ఫోన్ ఎత్తకుండా స్విచ్ఛాఫ్ చేయడం గమనార్హం.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...