26 నుంచి కుష్టు, క్షయ వ్యాధిపై ఇంటింటి సర్వే


Thu,August 22, 2019 01:52 AM

వనపర్తి వైద్యం : 26 నుంచి సె ప్టెంబర్ 12వ తేదీ ఆశ కార్యకర్త, మగ వలంటరీలు జాతీయ కుష్టు, క్షయ వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించాలని డీఎంహెచ్‌వో శ్రీ నివాసులు తెలిపారు. జిల్లాలోని పీహెచ్‌సీ డాక్టర్లు, సూపర్‌వైజర్లకు కుష్టు, క్షయ వ్యాధులపై బుధవా రం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు 20 ఇండ్లకు వెళ్లి ఈ వ్యాధులపై అవగాహన కల్పించి అనుమానితులను గుర్తించి నిర్ధారణ కోసం పీహెచ్‌సీలకు పంపాలని సూ చించారు. శరీరంపై పాలిపోయిన రాగివర్ణం, ఎర్రని మచ్చలు ఉండడం, కాళ్లల్లో, చేతుల్లో నరాల నొప్పి, వాపు ఉండడం వంటిని వ్యాధి లక్షణాలు అని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉండడం, బరువు తగ్గడం, కళ్లెం(తెమడ)లో రక్తం పడటం వంటివి ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీఎంహెచ్‌వో రవిశంకర్, డీఐ శంకర్, వంశీ, ఇస్మాయిల్, ఆనంద్ రెడ్డి, మద్దిలేటి, చంద్రయ్య తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...