ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాలి


Wed,August 21, 2019 03:02 AM

పెబ్బేరు : వ్యవసాయరంగంలో రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల అతిథి గృహంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రైతు పండించే ప్రతి గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని చెప్పారు. రైతులకు ప్రభుత్వ పరమైన సహకారం, వివిధ రకాల పథకాల అమలులో మెరుగైనా ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రమౌళి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు వరలక్ష్మి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి, వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...