ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష


Wed,August 21, 2019 03:01 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని పట్టణంలోని 21 నుంచి 26వ వార్డుల ఇన్‌చార్జి లోకనాథ్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి లోకనాథ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వాకిటిశ్రీధర్, లక్ష్మీనారాయణలు మంగళవారం పట్టణంలోని 25వ వార్డులో నూతన వార్డు కమిటీని సబ్ ఇన్‌చార్జిల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 25వ వార్డు అధ్యక్షుడిగా మల్లిఖార్జునస్వామి, ఉపాధ్యక్షులుగా విజయ్‌కుమార్ యాదవ్, నందిమల్ల గోపాల్, ప్రధాన కార్యదర్శిగా జ్ఞానేశ్వర్, కార్యదర్శులుగా మనోహర్, భాస్కర్ రెడ్డిలను ఏకగీవ్రంగా నియమించినట్లు తెలిపారు. వార్డుల సబ్ ఇన్‌చార్జిలు రాములుయాదవ్, గోపాల్ యాదవ్, సాయిబాబ, జాహంగీర్, నాగన్న యాద వ్, పుట్టపాక మహేష్ తదితరులు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...