ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ


Mon,August 19, 2019 03:32 AM

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మానవ మనుగడకు ముప్పుగా వాటిల్లిన ప్లాస్టిక్ వాడకా న్ని పూర్తిగా నివారించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. దీనిపై జిల్లాలోని సర్ప ంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలతోపాటు అధికారులకు స్వచ్ఛ వనపర్తి-హరిత వనపర్తి అన్న నినాదంతో ఓ అవగాహన సదస్సును నిర్వహించారు. ప్లాస్టిక్ నివారణకు మంత్రి నిరంజన్ రెడ్డి పక్కా ప్రణాళిక చేయగా, దీని అమలుకు కలెక్టర్ శ్వేతామొహంతి శ్రీకారం చుట్టారు. దీం తో జిల్లా వ్యాప్తంగా ప్లాస్టి ట్ నివారణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

గ్రామ, మండల స్థాయిలో..
ఆగస్టు 3న ప్లాస్టిక్ నివారణపై జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుతో గ్రామా లు, మండల స్థాయిలో అంకురార్పణ మొదలైంది. ఇందుకు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు ప్రత్యే క కార్యాచరణ తీసుకుంటున్నారు. అలాగే ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను ప్లాస్టిక్ నివారణలో భా గం చేస్తూ ప్రధాన భూ మిక పొషించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా మొదటి దశలో గ్రామాల్లో ఇదివరకే ఉపయోగించి వదలివేసిన ప్లాస్టిక్ చెత్తను పూర్తిగా ఏరివేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా రు. అలాగే వారపు సంతలు, గ్రామాల్లోని కిరా ణ, ఇతర వ్యాపారాలు చేస్తున్న యజమానులపై దృష్టి పెట్టి ప్లాస్టిక్ నివారణ కోసం ప్రయత్నిస్తున్నా రు. ఒక వైపు ఇప్పటి దాక ఉపయోగించిన ప్లాస్టిక్ చెత్తకవర్లను తొలగిస్తూ.. ఇప్పటి నుంచి వాడవద్దన్న సాంకేతాలను తెలియపరుస్తూ గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి పల్లెలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జిల్లాలోని స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కదలిక మొదలైంది.

పేపరు, బట్ట సంచులే మేలు
ప్లాస్టిక్ కవర్ల వాడకం ప్రాణాంతకమవుతున్న క్రమంలో వాటిని నివారించడమే శరణ్యం. ఇక వాటి స్థానంలో పేపరు కవర్లతోపాటు బట్ట సంచులను వినియోగించడం వల్ల సమస్యను నివారించే అవకాశం ఉంది. ఈ మేరకు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పేపర్ కవర్లను విద్యార్థుల ద్వారా తయారు చేయించి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల ద్వారా వీటిని సిద్ధం చేసి అవగాహన కార్యక్రమాల్లో పంపిణీ చేస్తున్నారు. అలాగే బట్ట సంచులను ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు చొరవ తీసుకున్న ప్రాంతా ల్లో ప్రజలకు పంపిణీ చేసి అవగాహన కల్పిస్తున్నా రు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి పేపరు కవర్లను తయారు చేయించిన అధికారులు వాటి ని ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగిస్తున్నారు.

ఉద్యమంలా రావాలి..
ప్లాస్టిక్‌ను నివారించేందుకు గ్రామాల్లో ఓ ఉద్యమంలా కదలికరావాల్సిన అవసరం ఉంది. కేవ లం సమావేశాల్లో అవగాహనకు మాత్రమే పరిమితమైతే మరింత ప్రాణాంతకంగా ప్లాస్టిక్ వాడ కం పరిణమిస్తుంది. మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతిలు పట్టుదలతో కార్యాచరణ ను మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ ని వారణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి చైతన్యం చేసే దిశగా గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అ దే చైతన్య కార్యక్రమాల్లో అవగాహన కోసం బట్ట సంచులు, పేపర్ సంచులను సైతం పంపిణీ చే యిస్తుండటంతో ఆలోచనలు మొదలవుతున్నా యి. ప్రజల్లో కదలిక వచ్చే దాకా కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఆ తర్వాత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మే దావులు, యువకులంతా ఉద్యమంలా ప్లాస్టిక్ నివారణకు పూనుకోవాల్సిన తరుణమిదే.

ప్లాస్టిక్ విషపూరితం..
మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ అనేక అనారోగ్య సమస్యలకు మూలమవుతుంది. దాదాపు ఐదు రకాలుగా ప్లాస్టిక్ వస్తువుల తయారీని పరిగణలోకి తీసుకుంటే.. ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా సమస్యలను తెస్తుందని మేధావులు గుర్తించారు. చివరకు సముద్రాలను సైతం ఈ ప్లాస్టిక్ మహమ్మారి కలుషితం చేస్తుండటం సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించేందుకు ప్లాస్టిక్‌ను వినియోగాన్ని నివారించడం మినహా మరో మార్గం లేదు. వాడిన ప్లాస్టిక్ కవర్లు.. ఇతర సామగ్రీ భూమిలో కలవడానికి 150 ఏళ్ల నుంచి 300 సంవత్సరాలు పడుతుండటం కూడా మనిషి మనుగడకు ప్రమాదంగా నిలుస్తుంది. ఇలా భూమిలో కలిసే గుణం లేని ప్లాస్టిక్ వినియోగంను ఎక్కడికక్కడ నివారించడమే శరణ్యంగా పల్లెలు.. పట్టణాలు స్వచ్ఛందంగా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...